- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూపాలపల్లిలో సంచలన ఘటన.. భార్య, కూతురిని నరికి చంపిన తండ్రి
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేషాలపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భార్య, కన్న కూతురును రమణాచారి అనే వ్యక్తి అతి కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపింది. కాగా, ఈ హత్యను ప్రత్యక్షంగా చూసిన రమణాచారి కుమారుడు విశ్వ తప్పించుకొని పారిపోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వేషాలపల్లిలో నివాసం ఉంటున్న ఎలగంటి రమణాచారికి భార్య రమణ, చందన, విశ్వ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, బుధవారం భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ చివరికి దాడి చేసుకునే వరకు వెళ్లింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన రమణచారి క్షణికవేశంలో భార్య రమణపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు.
ఈ క్రమంలో గాయపడిన తల్లిని రక్షించబోయిన కూతురు చందనపై కూడా గొడ్డలితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి, కూతుళ్లు ఇద్దరు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ మృత్యువాత పడ్డారు. ఇదంతా తమ 9 ఏళ్ల కుమారుడు విశ్వ కళ్ళ ముందే జరగడం దారుణం. దాడి అనంతరం కసాయి తండ్రి అక్కడి నుండి పారిపోయాడు. చందన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తల్లికూతుళ్లు అతి కిరాతకంగా హత్యకు గురికావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.