సీబీఐ అధికారినంటూ యువతికి వల.. చివరికి ఏమైందంటే..?

by Javid Pasha |
సీబీఐ అధికారినంటూ యువతికి వల.. చివరికి ఏమైందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: సీబీఐ అధికారినంటూ యువతికి వల వేశాడో వ్యక్తి. అయితే అనుమానం రావడంతో పెళ్లికి రెండు రోజుల ముందు అతడి గుట్టురట్టయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని షహరాన్ పుర జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షహరాన్ పుర జిల్లాలోని సదౌళి కడీమ్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాను సీబీఐ డీసీపీని అంటూ బహాద్రాబాద్ కు చెందిన యువతిని నమ్మించాడు. తనంటే ఇష్టమని, ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. ఈ క్రమంలోనే అతడిని నమ్మిన యువతి.. అతడితో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. యువతి తల్లిదండ్రులు కూడా పెళ్లికి ఒప్పుకున్నారు.

అయితే అనుమానం రావడంతో గతేడాది డిసెంబర్ లో పెళ్లికి రెండు రోజుల ముందు యువతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 4 నెలల తర్వాత ఏప్రిల్ 3వ తేదీన నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఫేక్ ఐడీ కార్డులు, ఫోటోలు స్వాధీనం చేసుకున్నట్లు హరిద్వార్ సీనియర్ పోలీస్ అధికారి అజయ్ సింగ్ తెలిపారు.

Advertisement

Next Story