భార్యను నరికి చంపిన భర్త.. వివాహేతర సంబంధమే కారణమా

by Sumithra |   ( Updated:2023-02-14 15:58:03.0  )
భార్యను నరికి చంపిన భర్త.. వివాహేతర సంబంధమే కారణమా
X

దిశ, బీర్కూరు : బీర్కూరు మండల కేంద్రంలోని 8వ వార్డులో గల చాకలి గంగామణిని ఆమె భర్త చాకలి గంగారం గొడ్డలితో నరికి చంపాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భర్త మరొక్క యువతితో అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను ప్రతిరోజు వేధించేవాడని తెలిపేవారు.

భార్యాభర్తలు ఇద్దరు ప్రతిరోజు గొడవపడేవారన్నారు. భార్య ఎంత చెప్పినా భర్త వినేవాడు కాదన్నారు. ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా గొడవపడ్డారని క్షణికావేశంలో చాకలి గంగారం భార్యను గొడ్డలితో నరికి చంపేశాడని తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed