- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సరదా కోసం కొన్న తుపాకీ... ప్రాణం తీసింది...
దిశ,ఉప్పల్ : సరదా కోసం కొన్న తుపాకీ... ప్రాణం తీసింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు తన సొంత తుపాకీ పేలి ఉప్పల్ కు చెందిన విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఉప్పల్ ధర్మపురి కాలనీకి చెందిన పాల్వాయి సుదర్శన్ రెడ్డి, గీత దంపతులకు ఏకైక కుమారుడు ఆర్యన్ రెడ్డి (23) ఉన్నాడు. వీరిది భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పెద్దరావు పల్లి గ్రామం. కాగా ఉప్పల్లో స్థిరపడి వ్యాపారం చేస్తున్నారు. ఆర్యన్ రెడ్డి బీటెక్ పూర్తి చేసి పైచదువుల కోసం జార్జియా స్టేట్, అట్లాంట పట్టణంలో కేన్నిస స్టేట్ యూనివర్సిటీలో ఎమ్మెస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 13వ తారీకున తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు.
అదే రోజు ఉదయం 10 గంటల సమయంలో ఆర్యన్ ఉండే గది నుండి తుపాకీ శబ్దం రావడంతో తన స్నేహితులు వెళ్లి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. తుపాకీ తూట ఛాతి లోపల నుంచి దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తుపాకీ శుభ్రం చేసే సమయంలోనే ప్రమాదవశాత్తు అది పేలి మృతిచెంది ఉంటాడని మృతుడి తండ్రి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఆర్యన్ రెడ్డి ఈ ఏడాది ఆగష్టులోనే హంటింగ్ గన్ కు లైసెన్స్ తీసుకున్నాడు. అది కూడా అక్కడ నిర్వహించే ఓ పరీక్ష రాయడంతో గన్ కు లైసెన్సు లభించిందని మృతుడి తండ్రి తెలిపాడు. అదే తమ కుటుంబంలో విషాదం మిగిల్చిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. గురువారం రాత్రి అమెరికా నుంచి ఆర్యన్ రెడ్డి మృతదేహం హైదరాబాద్ కు రానున్నట్టుగా మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
- Tags
- Crime