ఆ పని చేసిందని కూతురును చంపి తండ్రి ఆత్మహత్య

by Javid Pasha |
ఆ పని చేసిందని కూతురును చంపి తండ్రి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: లవ్ మ్యారేజ్ చేసుకుంటానందనే కోపంతో ఓ తండ్రి తన కూతురును దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆగ్రాలోని కస్‌గంజ్‌ లో జరిగింది. కస్‌గంజ్‌ ఎస్పీ సౌరభ్ దీక్షిత్ తెలిపిన వివరాల ప్రకారం.. కస్‌గంజ్‌ లోని టీచర్స్ కాలనీలో ఓ టీచర్ తన భార్య కూతురితో కలిసి ఉంటున్నాడు. అయితే తన 26 ఏళ్ల కూతురు తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పింది. కానీ ఆ తండ్రి వద్దని ఆమెను వారించాడు.

అయితే కూతరు ఎంతకూ వినకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి.. పిస్టల్ తో కూతురును చంపి తనూ కాల్చుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న తండ్రి కూతుళ్లనిద్దరిని స్థానికుల సహాయంతో ఆ టీచర్ భార్య ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ వారు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరంచారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed