పదేళ్ల కుమారుడిని కాళ్లు చేతులు కట్టి నగ్నంగా రైల్వే ట్రాక్ పై కూర్చోబెట్టిన కసాయి తండ్రి

by Javid Pasha |
పదేళ్ల కుమారుడిని కాళ్లు చేతులు కట్టి నగ్నంగా రైల్వే ట్రాక్ పై కూర్చోబెట్టిన కసాయి తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్: తన పదేళ్ల కుమారుడిపై ఓ తండ్రి అమానుషంగా ప్రవర్తించాడు. చెప్పిన మాట వింటలేడంటూ రాత్రిపూట కుమారుడి బట్టలిప్పించి, కాళ్లు చేతులు కట్టేసి రైల్వే ట్రాక్ పై కూర్చోబెట్టాడు. ఈ దారుణం యూపీలోని హర్దోయ్‌లో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఓ వ్యక్తి తన కొడుకు కాళ్లు చేతులు కట్టేసి నగ్నంగా రైల్వే ట్రాక్ పై కూర్చోబెట్టాడు. అయితే అక్కడికి వచ్చిన ఓ మహిళ ఎందుకు అలా చేస్తున్నావు అంటూ అతడిని ప్రశ్నించింది.

ఇక అప్పుడే అటుగా ట్రైన్ వస్తున్నది గమనించి బాలుడిని ట్రాక్ నుంచి పక్కకు తీసుకెళ్లాలని అతడిని గట్టిగా కోరింది. దీంతో అతడు ఆ బాలుడిని అమాంతం ఎత్తుకొని పక్కకు తీసుకెళ్లాడు. అయితే ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Advertisement

Next Story