విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి..

by Sumithra |
విద్యుత్ తీగలు తగిలి రైతు మృతి..
X

దిశ, ముధోల్ : ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో శనివారం అడవి జంతువుల నుండి పంటను కాపాడుకోవడానికి వేసిన విద్యుత్ తీగలు తగిలి రామకృష్ణ (40) అనే రైతు మృతి చెందాడు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులోని తనచేనులో మొక్కజొన్న పంటకు అటవీ జంతువుల నుంచి కాపాడుకోవడానికి వేసిన విద్యుత్ తీగ తగిలి రైతు మృతి చెందినట్లు పేర్కొన్నారు.

రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed