ఓ జంట బాత్రూంలో కలిసి స్నానం చేస్తూ చనిపోయారు.. అసలేం జరిగిందంటే?

by Prasanna |   ( Updated:2023-06-13 06:59:02.0  )
ఓ జంట బాత్రూంలో కలిసి  స్నానం చేస్తూ చనిపోయారు.. అసలేం జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్లైన జంట గుండె పోటుతో చనిపోవడం విన్నాం ఆ తర్వాత ఫస్ట్ నైట్ రోజున ప్రాణాలు విడిచిన జంట.. ఇలా ఒకటి కాదు రోజూ ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా కర్నాటకలోని బెంగుళూరులో జరిగిన ఘటన ఐతే మరి ఘోరం. బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లిన జంట అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకు వెలుగులోకి వచ్చింది. వారు ఎలా చనిపోయారా అని ఆరా తీస్తే .. స్నానం చేస్తుండగా గీజర్‌లోంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీకవడంతో ఇద్దరూ చనిపోయినట్టు గుర్తించారు. సమాచారాన్ని వెంటనే పోలీసులకు చెప్పగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read more: అలా చేయొద్దని చెప్పినా వినడం లేదని తల్లిని చంపి బాడిని సూట్‌కేసులో కుక్కిన కూతురు

Advertisement

Next Story

Most Viewed