- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూల్ బయట నిల్చున్న విద్యార్థులను ఢీకొట్టిన కారు.. మగ్గురు మృతి..
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: అతి వేగంగా వచ్చిన కారు గోడను ఢీకొట్టి స్కూల్ బయట నిల్చున్న విద్యార్థుల పైనుంచి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషాద సంఘటన ఒడిశాలోని సోనెపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శారద పల్లి ప్రాథమికోన్నత పాఠశాల గేటు ముందు నిలబడి ఉండగా అతి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. ఆ తర్వాత అక్కడే నిల్చున్న విద్యార్థులను ఢీకొట్టడంతో ఆరో తరగతికి చెందిన ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కారును స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Next Story