గెలిచినా, ఓడినా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
Captain Virat Kohli
X

దిశ, వెబ్‌డెస్క్ : క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడతున్న విషయం తెలిసిందే. అయితే ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క మ్యాచ్ తమ​జట్టు ప్రదర్శనను ప్రతిబింబించదని.. అది డబ్ల్యూటీసీ ఫైనల్ అయినా ఇతర మ్యాచ్ అయినా.. అంతేనని కోహ్లీ తెలిపాడు.

ఇది తనకు మరో సాధారణ మ్యాచ్‌తో సమానమని అన్నాడు. ఐదురోజుల పాటు జరిగే.. ఒక్క గేమ్​ఆధారంగా తమ జట్టు ప్రదర్శనను నిర్ణయించకూడదని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా.. మాకు క్రికెట్ మాత్రం ఆగదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయం కోసం మా జట్టు సామర్థ్యం మేరకు పోరాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ బ్యాట్‌కు, బాల్‌కు సంబంధించినదని కోహ్లీ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed