- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీసీఐకి క్రికెట్ ఆస్ట్రేలియా భావోద్వేగ లేఖ
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా పర్యటించినందుకు బీసీసీఐకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ దేశ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా బహిరంగ కృతజ్ఞత లేఖ విడుదల చేసింది. కరోనా కష్టకాలంలో టీమ్ ఇండియా తమ దేశానికి వచ్చి ఆడిన సిరీస్‌ను మరుపురానిదిగా మార్చినందుకు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ ఎర్ల్ ఎడింగ్స్, సీఈవో హాక్లీ ఆ ప్రకటనలో తెలిపారు. ‘కరోనా సంక్షోభ సమయంలో బీసీసీఐ తమకు అందించిన సహకారం మరువలేనిది. కఠినమైన కొవిడ్ ఆంక్షలు, బయోబబుల్ నిబంధనలు తట్టుకొని ఆస్ట్రేలియాలో పర్యటించినందుకు ధన్యవాదాలు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఈ సిరీస్‌ను వీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలలో ఇదే అత్యుత్తమమైనదిగా మేం భావిస్తున్నాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జట్టు ముందుకు వెళ్లడం సంతోషాన్ని ఇచ్చింది. కోహ్లీ లేకున్నా జట్టును విజయవంతంగా నడిపించిన అజింక్య రహానేకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. అలాగే రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, స్టీవ్ స్మిత్, శుభమన్ గిల్, కామెరూన్ గ్రీన్ లకు అభినందనలు. మరిచిపోలేని సిరీస్ అందించిన బీసీసీఐకి మరోసారి థ్యాంక్స్. వాళ్ల స్నేహం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.