- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
13 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
దిశ, నల్లగొండ: రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామ పరిధిలోగల 408 సర్వే నెంబరులో సుమారు 13 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన భూ బకాసూరులపై చర్యలు తీసుకుని ఆ భూమిని సర్వే చేసి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ డిమాండ్ చేశారు. ఆసీఫ్ నహర్ కాల్వ సమీపంలో గల భూమిని స్థానిక సర్పంచ్ యాదాసు కవితయాదయ్య, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొన్ని వందల ఎకరాలు భూములు కొనుగోలు చేసి వాటి చుట్టూ ఫినిషింగ్ చేసిన కొంతమంది భూ బడా వ్యాపారులు మునిపంపుల గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూమిని సైతం దాంట్లో కలిపేసుకుని ఫినిషింగ్ వేశారని తెలిపారు. గతంలో ఈ భూమిని పేదలకు పంచాలని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో జెండాలు నాటి పోరాటం చేస్తే నాయకులపై కేసులు పెట్టి జైళ్ళకు పంపించిన ప్రభుత్వం ఇప్పుడు బడా పెట్టుబడి దారులు ఆక్రమిస్తే చోద్యం చూస్తుందన్నారు. రాజకీయ నాయకుల అండతో రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్నారు. ఓ వైపు సెంటు భూమి లేక పేదలు కాలమెల్లదీస్తుంటే ఇలాంటి భూ బకాసూరులు ఆక్రమిస్తున్నారన్నారు. వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించి భూమిని గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దల సమక్షంలో సర్వే చేసి అన్యాక్రాంతం కాకుండా చూడాలన్నారు. లేని పక్షంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటి సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, శాఖ కార్యదర్శి తాళ్ళపల్లి జితేందర్, నాయకులు జోగుల శ్రీనివాస్, నోముల రమేష్, మేడి బాషయ్య, గంటెపాక శివ కుమార్, శ్రీను, చంటిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags: government, land, visit, cpm leaders, nalgonda, bhuvanagiri