ఎర్రజెండా ఉద్యమాలు షురూ.. మాజీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

by Shyam |
CPM leader Jhulakanti Rangareddy
X

దిశ, మిర్యాలగూడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ మొదటి వారంలో గ్రామ స్థాయిలో ఉద్యమాలు చేపట్టనున్నట్లు సీపీఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామస్థాయి నుంచే పాలకులపై ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఎన్నికల్లో గెలుపు కోసమేనని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలు అదుపు చేయడంలో విఫలమైన బీజేపీ నాయకులు యాత్రలు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఆందోళనలకు ప్రజలు మద్దతిచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు డబ్బికార్ మల్లేష్, నూకల జగదీష్ చంద్ర, మల్లు గౌతంరెడ్డి, రవినాయక్, రామ్మూర్తి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed