- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోము వీర్రాజు కాదు.. సారాయి వీర్రాజు: బీజేపీ చీఫ్‌పై సీపీఐ రామకృష్ణ ఫైర్
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో బీజేపీ, వామపక్షాల మధ్య కోల్డ్ వార్ రోజు రోజుకు తీవ్రమవుతుంది. ఇటీవల కాలంలో బీజేపీ వామపక్షాలపై విమర్శల దాడికి దిగుతుంది. విజయవాడలో ప్రజాగ్రహ సభలోనూ వామపక్ష పార్టీలను వదల్లేదు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. కమ్యూనిస్టులు మెురిగే కుక్కలని.. దేశానికి పట్టిన చీడ పురుగులు అంటూ ధ్వజమెత్తారు. సోము వీర్రాజు వ్యాఖ్యలకు సీపీఐ రాష్ట్రకార్యదర్శి కే రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్ర ప్రజలు మద్యనిషేధం కోరుతుంటే, బీజేపీ మాత్రం మద్యం ఏరులుగా పారిస్తానంటోంది. కోటి మంది మందుబాబులు ఉన్నారని, వారంతా బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పటం వీర్రాజు పిచ్చికి పరాకాష్ట అని చెప్పుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు మతి భ్రమించినట్లుంది. సోము వీర్రాజును ఇకపై సారాయి వీర్రాజుగా పిలవాలేమో! బీజేపీ అధికారంలోకొస్తే చీప్ లిక్కర్ కారుచౌకగా అందిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించడం దుర్మార్గం అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు.