ప్రధాని అలా చేస్తే.. రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లే !

by Shyam |
ప్రధాని అలా చేస్తే.. రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లే !
X

దిశ, న్యూస్‌బ్యూరో: లౌకిక దేశ ప్రధాని మోడీ రామాలయ శంకుస్థాపనకు వెళ్లడమంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లే అవుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. సెక్యులర్ దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు తప్ప ఒక మతాధిపతి కాదన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందన్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రే చర్యలు మొదలు పెడితే దేశంలో అరాచకం మొదలవుతుందన్నారు.

Advertisement

Next Story