- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్ బ్రేక్ చేసైనా సరే: నారాయణ
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్ బ్రేక్ చేసైనా సరే వలస కూలీలను స్వస్థలాలకు తరలించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. వలస కూలీల తరలింపు విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరులో నారాయణ పర్యటిస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్ళడానికి ఇబ్బందిపడుతున్నారన్న సమాచారం మేరకు కొత్తూరుకు రావడం జరిగిందని స్పష్టం చేశారు. ప్రభుత్వాల ముందుచూపు లోపం కారణంగా కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా తగు ఏర్పాట్లు చేసి వలస కూలీలను స్వస్థలాలకు తరలించాలని సీపీఐ నేత నారాయణ సూచించారు.
Advertisement
Next Story