ఆ కార్పొరేషన్‎లో స్క్రాప్ మాయం.. సీపీఐ నేతల ఆగ్రహం

by Sridhar Babu |
ఆ కార్పొరేషన్‎లో స్క్రాప్ మాయం.. సీపీఐ నేతల ఆగ్రహం
X

దిశ, గోదావరిఖని: రామగుండం మునిసిపల్ కార్పొరేషన్‌లో స్క్రాప్ అమ్ముకోవడం అత్యంత దురదృష్టకరమంటూ సీపీఐ నాయకులు కె. కనక‌రాజ్, మద్దెల దినేష్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వారిద్దరు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, కొంత మంది అవినీతి అధికారుల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. రామగుండం కార్పొరేషన్‌లో పెద్ద ఎత్తున స్క్రాప్ మాయమైందని.. టన్నుల కొద్ది రాత్రికి రాత్రే అమ్మకానికి మళ్లీంచినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయన్నారు. మున్సిపాలిటీకి చెందిన పాత ట్యాంకర్లు, వీల్ బార్లు, ట్రాక్టర్లు, పాత ఆటోలు ఇలా పెద్ద ఎత్తున సామగ్రి మాయం అయిందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే స్క్రాప్ మొత్తం మాయమైందని.. తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed