‘అధికారంలోకి వచ్చాక జగన్ అలాగే చేస్తున్నారు’

by srinivas |   ( Updated:2020-08-18 05:01:53.0  )
‘అధికారంలోకి వచ్చాక జగన్ అలాగే చేస్తున్నారు’
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ(ఎం) ఏపీ కార్యదర్శి మధు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పటికీ.. భూ నిర్వాసితులను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించిందంటూ మధు మండిపడ్డారు. ఎన్నికల ముందు నిర్వాసితులను ఆదుకుంటామన్న జగన్.. అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం లాగానే నిర్లక్ష్యం వహిస్తున్నారని దుయ్యబట్టారు.

గోదావరి వరదల కారణంగా వందల గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని మధు ఆందోళన వ్యక్తం చేశారు. ముంపునకు ప్రధాన కారణం ప్రభుత్వాల నిర్లక్ష్యమే అంటూ విమర్శించారు. తక్షణమే భూనిర్వాసితులను, ముంపు ప్రాంతాల ప్రజలను వైసీపీ ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story