‘ఆ జీవో జారీ.. కేసీఆర్ చేతకానితనమే’

by Shyam |
‘ఆ జీవో జారీ.. కేసీఆర్ చేతకానితనమే’
X

దిశ, నల్లగొండ: కృష్ణా జలాల వినియోగంపై సీఎం కేసీఆర్ కళ్లు తెరవాలని, లేనిపక్షంలో నాగార్జున‌సాగర్ ఆయకట్టు ఎడారిగా మారడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు విస్తరణ జీవో కేసీఆర్ చేతకానితనానికి నిదర్శనమన్నారు. కృష్ణానదిలో తెలంగాణ నీటి వాటాను వినియోగించుకోకపోవడంలో ప్రభుత్వ వైఫల్యం చెందిందన్నారు. పాలమూరు, రంగారెడ్డి, ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గాలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యం చేసేలా భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. సదస్సులో మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed