రైతుల పోరాటంలో కేసీఆర్ పాత్ర శూన్యం.. టీఆర్ఎస్‌పై చాడ విమర్శలు

by Shyam |
CPI leader Chada Venkat Reddy
X

దిశ, కాళోజీ జంక్షన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దొంగాటలో పేద రైతులు నష్టపోతున్నారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం భట్టుపెల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను చాడ పరిశీలించారు. అంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్టంలో పంట విస్తీర్ణం పెరిగిందని, దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు.

రైతుల బలిదానాలకు, ఆందోళనలకు దిగొచ్చిన కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేస్తే, కేసీఆర్ ఒక్కరోజు ధర్నాకే రద్దు చేశారని టీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. రైతుల పోరాటంలో కేసీఆర్ పాత్ర శూన్యమని అన్నారు. ప్రజాస్వమ్యంలో ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చాడ వెంకట్ రెడ్డి వెంట సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి మేకల రవి, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, జిల్లా సహాయ కార్యదర్శి కర్రె భిక్షపతి, నాయకులు షేక్ బాష్ మియా, తోట భిక్షపతి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వలీ ఉల్లా ఖాద్రి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed