- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ వస్తే పట్టుకుంటాం: సజ్జనార్
దిశ, క్రైమ్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తే.. వదిలే ప్రసక్తే లేదని, కచ్చితంగా పట్టుకుని తీరుతామని అంతరాష్ట్ర ముఠా దొంగలకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ కంటే ముందు.. అధికంగా వచ్చే అంతరాష్ట్ర దొంగలను, రాష్ట్రావతరణ తర్వాత చాలా వరకూ కట్టడి చేశామన్నారు. హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ మూడేళ్ల కాలంలో 24 గ్యాంగ్‌లను పట్టుకున్నామని అన్నారు.
వీటిలో మాదాపూర్ జోన్ లో 10, శంషాబాద్ జోన్ లో 4, బాలానగర్ జోన్ 9, సైబర్ క్రైమ్ విభాగం 1 ముఠాలను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా 95 మందిని అరెస్టు చేయగా, 6 ఆయుధాలతో పాటు రూ. 5.39 కోట్లను సీజ్ చేసినట్టు తెలిపారు. వీటిలో చండీఘర్ గ్యాంగ్, మోర్ధాబాద్ హౌజ్ బ్రేకింగ్ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్, కడప రాబరీ గ్యాంగ్, చడ్డీ గ్యాంగ్, యూపీ గ్యాంగ్, అస్సాం, రాజస్థాన్, గుజరాత్, మణప్పురం గ్యాంగ్ తో పాటు తాజాగా ముత్తూట్ గ్యాంగ్‌లను పట్టుకున్నామని అన్నారు. అంతరాష్ట్ర దొంగలు ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తే సహించేది లేదన్నారు.