- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌కు సీపీ ఫోన్.. ఏమన్నారంటే
by Shyam |

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: ‘మంథనిలో లీగల్ ఫ్యాక్షన్’ అన్న రామగుండం సీపీ సత్యనారాయణ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై న్యాయవాద వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఆయనకు లీగల్ నోటీసులు పంపించేందుకు మంథని బార్ అసోసియేషన్ రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై సీపీ సత్యనారాయణ వివరణ ఇచ్చారు.
మంథనిలో పోలీసు వ్యవస్థను ఉద్దేశించి తాను మాట్లాడాను తప్ప న్యాయ వ్యవస్థను ఉద్దేశించి ఆ పదాన్ని తాను ఉపయోగించలేదని అన్నారు. ఈ మేరకు మంథని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కర్ణ హరిబాబుకు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు. లాయర్‌లను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు సీపీ. మంథని బార్ అసోసిషన్ అంటే తనకు గౌరవం ఉందని కూడా చెప్పారని హరిబాబు తెలిపారు.
Next Story