- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టెక్నాలజీలో మనమే బెస్ట్
– సీపీ అంజనీకుమార్
దిశ, క్రైమ్‌బ్యూరో: దేశంలో ఏరాష్ట్ర పోలీసులకు లేని టెక్నాలజీ హైదరాబాద్ క్లూస్ టీంకు ఉందని సీపీ అంజనీకుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్‌లోని సీసీఎస్, క్లూస్ టీమ్ విభాగాలను సీపీ సందర్శించారు. నేరాలకు పాల్పడిన వెంటనే నిందితులను పట్టుకునేందుకు సూపర్ లైట్ టెక్నాలజీ వినియోగిస్తున్నామన్నారు. సంచలనాత్మకమైన కేసుల్లో సీన్ ఆఫ్ క్రైమ్‌లోని ఆధారాలను ప్రజలు రక్షించాలన్నారు. నగరంలోని 17డివిజన్లలో క్లూస్ టీమ్ సిబ్బంది 24గంటల పాటు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నేరస్థులు కూడా టెక్నాలజీ వాడుతున్నారని, కేసులను పరిష్కరించేందుకు క్లూస్ టీంకు సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యమన్నారు. గతేడాది జరిగిన దిశ ఘటనతో పాటు మరో 15కేసుల్లో సూపర్ లైట్ టెక్నాలజీ ఉపయోగించడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా క్లూస్ టీమ్ సిబ్బందిని సీపీ అంజనీకుమార్ అభినందించి, బహుమతులను అందజేశారు.