చంద్రబాబు ఇంటి వద్ద కానిస్టేబుల్‌కు కరోనా

by srinivas |   ( Updated:2020-06-13 22:46:41.0  )
చంద్రబాబు ఇంటి వద్ద కానిస్టేబుల్‌కు కరోనా
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నివాసం వద్ద బందోబస్తులో పాల్గొన్న ఓ కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. గుంటూరు జిల్లా బాపట్ల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌.. బందోబస్తు నేపథ్యంలో గత నెల 5 నుంచి నెల రోజుల పాటు హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం వద్దనే ఉన్నాడు. తిరిగి జూన్ 7వ తేదిన ఆయన బాపట్ల చేరుకున్నాడు. కరోనా వ్యాధి లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయగా.. శనివారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. చంద్రబాబు నివాసం వద్దనే అతడితో విధులు నిర్వహించిన తోటి కానిస్టేబుల్ నుంచి వైరస్ సోకినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed