ఫిబ్రవరి నాటికి.. భారత్ బయోటెక్ 'కోవాక్సిన్'!

by Anukaran |
ఫిబ్రవరి నాటికి.. భారత్ బయోటెక్ కోవాక్సిన్!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కరోనా వైరస్ టీకా ‘కోవాక్సిన్’ 2021 ఫిబ్రవరి నాటికి ఊహించిన దానికంటే కొన్ని నెలల ముందుగా ప్రారంభించనున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ చివరి దశ పరీక్షలు ఈ నెలలో ప్రారంభం కానున్నట్టు, ఈ పరీక్షల కోసం 25 వేల మంది ప్రజలపై జరపనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐఏ)లతో కలిసి కోవాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ 2021 రెండో త్రైమాసికంలో వ్యాక్సిన్‌ను విడుదల చేయాలని భావించింది.

ఐసీఎంఆర్ సీనియర్ శాస్త్రవేత్త రజనీకాంత్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రస్తుత టీకా సమర్థవంతంగా పనిచేస్తోంది. మూడో దశ పరీక్షలకు ముందే కోవాక్సిన్ ప్రజలకు ఇవ్వొచ్చా లేదా అనేది ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వచ్చే ఏడాది ఫిర్బవరి నాటికి అందుబాటులో వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. మొదటి, రెండో దశ పరీక్షలో వ్యాక్సిన్ భద్రత, సామర్థ్యాన్ని చూపించింది. అయితే, మూడో దశ పరీక్షలు ముగిసిన తర్వాతే వందశాతం పనితీరుపై నిర్ధారణకు రావచ్చని ఆయన పేర్కొన్నారు. అవసరమనుకుంటే అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఇవ్వడంపై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. కాగా, సీరం ఇన్‌స్టిట్యూట్ వారి వ్యాక్సి సైతం వచ్చే ఏడాది జనవరి నాటికి లభించే అవకాశాలున్నాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed