- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రాష్ట్ర సీఎంకు కోర్టు సమన్లు..
ఎన్నికల నియమావళిని ఉల్లఘించారని కారణంతో కర్ణాటక సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు గోకక్‌లోని ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. 2019లో గోకక్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం నియమావళిని ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై న్యాయస్ధానం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సీఎం యడియూరప్పకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో యడియూరప్ప రెండుసార్లు కులం ప్రస్తావన తెచ్చారని, అది ఎన్నికల నియమావళికి విరుద్ధమని, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోర్టు సమన్లలో వివరణ కోరింది.
ఆ ప్రచారంలో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడిన సీఎం.. రెండుసార్లు కులం ప్రస్తావన తెచ్చారు. వీరశైవ లింగాయత్‌ల ఓట్లు చీలిపోకుండా చూసుకోవాలని ఓటర్లను కోరారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రచారంలో కులం ప్రస్తావన తీసుకురావడం ద్వారా యడియూరప్ప ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పలు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గోకక్ పీఎస్‌లో కేసు నమోదుకావడం, ఆపై కోర్టు విచారణ జరపడంతో సీఎంకు సమన్లు జారీ అయ్యాయి. కాగా, దీనిపై కర్ణాటక సీఎం ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.