- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్
దిశ ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో వినయ్ భాస్కర్‌పై నమోదైన కేసులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు బుధవారం వారెంట్ జారీ చేసింది. 2012 కాజీపేట రైల్వేస్టేషన్‌లో దాడి చేసిన కేసులో వినయ్ భాస్కర్‌తో పాటు మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట వరంగల్ జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు కేసు బదిలీ అయింది. అయితే కేసు హైదరాబాద్‌లోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ అయినప్పటి నుంచి వినయ్‌భాస్కర్ సహా తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ఒక్కసారి కూడా హాజరు కాలేదు. బుధవారం విచారణకు హాజరైన టీఆర్ ఎస్ నేత తక్కళ్లపల్లి రవీందర్ రావు తదితరులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
తక్కళ్లపల్లి రవీందర్ రావు సహా ఏడుగురికి రిమాండ్ విధించిన న్యాయస్థానం.. అనంతరం ఒక్కొక్కరికి పది వేల రూపాయల పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది. నిందితుడిగా ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆచూకీ లభించడం లేదని సుబేదారి పోలీసులు ఇచ్చిన వివరణను న్యాయస్థానం రికార్డు చేసింది. ఎమ్మెల్యే వినయ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అలాగే అమరేందర్ రెడ్డి, శ్రీరాములు, నరోత్తంరెడ్డిలపై ఎన్‌బీడబ్ల్యూ అమలు చేయకపోవడంపై కాజీపేట పోలీసులపై ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 3లోగా ఎన్ బీడబ్ల్యూ అమలు చేయకపోతే కాజీపేట ఎస్ హెచ్ఓపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ప్రజాప్రతినిధుల కోర్టు తెలిపింది.