కాల్ మనీ గ్యాంగ్ వేధింపులు భరించలేక..

by srinivas |
కాల్ మనీ గ్యాంగ్ వేధింపులు భరించలేక..
X

దిశ,వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో కాల్ మనీ కేటు గాళ్లు రెచ్చి పోతున్నారు. స్థానికులకు కేటుగాళ్లు అధిక వడ్డీలకు అప్పులు ఇస్తున్నారు. సుమారు నూటికి 30 రూపాయల దాకా వడ్డీని వారి నుంచి వసూలు చేస్తున్నారు. ఇక తీసుకున్న డబ్బుకు సరైన సమయంలో కడితే సరీ…లేదంటే డబ్బులు ఇచ్చే వరకు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా కేటుగాళ్లు పెడుతున్న ఇబ్బందులను తట్టుకోలేక తాడే పల్లిలో భార్య భర్తలు ఆత్మ హత్యా యత్నం చేశారు.

తాము రూ. 2 లక్షలు అప్పుగా తీసుకున్నామనీ, ఇప్పుడు దానికి రూ. 14 లక్షలను కేటుగాళ్లు వసూలు చేస్తున్నారని వాపోయారు. కాగా ఈ విషయాన్ని పలు మార్లు పోలీసుల దృష్టికి తీసుకుపోయిన వారు స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కేటుగాళ్లు తమ ఇంటిపైకి వచ్చి దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. కాల్ మనీ గ్యాంగ్ నుంచి తమకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed