- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుటుంబ కలహాలే కారణం..
దిశ వెబ్ డెస్క్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సికింద్రబాద్ లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబర్ నగర్ లో వెంకటేష్ భార్గవి దంపతులు నివాసం ఉంటున్నారు. ఎనిమిదేండ్ల క్రితం వీరిద్దరికి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఎలక్ట్రిసిటీ డిపార్ట్ మెంట్‌లో వెంకటేశ్ ఏఈగా పనిచేస్తుండగా…భార్గవి పోస్టల్ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం చేస్తున్నది. అత్తమామల నుంచి వేధింపులు వస్తుండటంతో ఆమె తన భర్తతో కలిసి వచ్చి అంబర్ నగర్ లో వేరు కాపురం పెట్టింది. కాగా గురువారం ఉదయం చూడగా గదిలో ఫ్యాన్ కు వెంకటేశ్ శవం వేలాడుతుండగా…బాత్రూమ్ కిటికీకీ భార్గవి ఉరేసుకుని కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. భార్గవి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.