రమేష్ ఎక్కడంటే… బాబాయిని చంపింది ఎవరంటారే..??

by srinivas |
రమేష్ ఎక్కడంటే… బాబాయిని చంపింది ఎవరంటారే..??
X

చంద్రబాబూ…. నేరుగా అడుగుతున్నా. ఇంతకీ డాక్టర్ రమేష్ ను మీ ఇంట్లో దాచారా? లేక మీ కొడుకు ఇంట్లో దాచారా? ఇంతకీ నిమ్మగడ్డ రమేష్, డాక్టర్ రమేష్.. ఈ ఇద్దరితో మీకున్న అనుబంధం ఏమిటి? ఇది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్. ఆయన చేసిన ఈ ట్వీట్ పై టీడీపీ నేతలు, అభిమానులు ఘాటుగా స్పందించారు.

వివేకానంద రెడ్డి హత్య కేసును లేవనెత్తి విజయసాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. వివేకానందరెడ్డి చావుకి కారణం గుండె పోటా లేక గొడ్డలి పోటా? బాబాయిని బెడ్ రూమ్ లో చంపి బాత్రూం లో వేశారా లేక బాత్రూం లో చంపారా? చంపిన వాళ్ళని మీ ఇంట్లో దాచారా లేక మీ అల్లుడు ఇంట్లో దాచారా విజయసాయిరెడ్డి అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

ఇక టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ పై అదే తీరులో స్పందించారు. “డాక్టర్ రమేష్ గారు చంద్రబాబు గారి ఇంట్లో నే ఉన్నారు.—వైసీపీ నేతలు. కానీ బాబాయ్ ని చంపిన వారు మాత్రం ఎక్కడ ఉన్నారో తెలీదు అంతే కదా!” అంటూ ట్వీట్ చేశారు బుచ్చయ్య చౌదరి.

https://twitter.com/GORANTLA_BC/status/1298251515589623809?s=20

Advertisement

Next Story