పారిశుధ్య కార్మికుడికి రూ.50దండతో సన్మానం

by Aamani |
పారిశుధ్య కార్మికుడికి రూ.50దండతో సన్మానం
X

దిశ, ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో పారిశుధ్య కార్మికులు విశిష్ట సేవలందిస్తున్నారు. వారి అందిస్తున్న సేవలను గుర్తించిన ఓ కౌన్సిలర్ దంపతులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. తమ వార్డుల్లోకి వచ్చిన కార్మికులను ఆదరించాలని ప్రజలను కోరారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో అశోక్-సువర్ణ అనే కౌన్సిలర్ దంపతులు ఒక కార్మికుడికి రూ.50 దండ వేసి సన్మానించారు. మున్సిపల్ వర్కర్ల మీద కౌన్సిలర్ దంపతులు కనబరిచిన మానవతా ధృక్పతాన్ని పలువురు అభినందిస్తున్నారు.

Tags: corona, lockdown, municipal workers, currency garland

Advertisement

Next Story