బ్రేకింగ్ : అమ్మవారి ఆలయంలో అవినీతి అధికారులు.. సస్పెండ్…

by Shyam |
basara saraswati temple
X

దిశ, బాసర : నిర్మల్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరడా ఝులిపించారు. అమ్మవారి ఆలయంలో 2017 సంవత్సరం లో నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై పలువురు అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2017 సంవత్సరంలో సుమారు ఆరు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల తొంభై రూపాయల అనధికార బిల్లును సృష్టించి డబ్బులు కాజేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ మాజీ ఏఈవో గంగా శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ శైలేష్ , రిటైర్డ్ సూపరింటెండెంట్ మమ్మాయి సాయిలు, కంప్యూటర్ ఆపరేటర్ నూకం రజిని లతో పాటు మిగత ఔట్ సోర్సింగ్ సిబ్బంది పై దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story