- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: మంగళగిరి ఎయిమ్స్‌కు మరో 10 ఎకరాలు
దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి ఎయిమ్స్(Mangalagiri AIIMS)కు మరో 10 ఎకరాలను భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఎయిమ్స్ డైరెక్టర్ మరో 10 ఎకరాలు కావాలని అడగడంతో అందుకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government)తరుపున వెంటనే ఆ భూమిని ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత పాలనలో నీటి కోసం మంగళగిరి ఎయిమ్స్ నిర్మాహకులు ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌కు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే నంబర్ వన్ అవడానికి, ఎలాంటి సహకారం అయినా కూటమి ప్రభుత్వం ఇస్తుందని నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళగిరి ఎయిమ్స్‌కు 2014లో చాలా సుందరమైన ప్రదేశంలో భూమి ఇచ్చామని చెప్పారు. అమరావతికి, మంగళగిరి ఎయిమ్స్ ఒక సిగలా ఉంటుందన్నారు. ఈ దేశంలోనే మంగళగిరి ఎయిమ్స్ నంబర్ వన్ అవుతుందని ఆశిస్తున్నానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.