ఆర్థిక భారంగా మారిన ఆన్‌లైన్‌ క్లాసులు

by Shyam |   ( Updated:2020-12-18 21:25:35.0  )
ఆర్థిక భారంగా మారిన ఆన్‌లైన్‌ క్లాసులు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆన్​లైన్ క్లాసుల పేరుతో ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్నాయి. స్మార్ట్ ఫోన్, స్కూల్ బుక్స్, ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారాయి. మరోవైపు ఆన్​లైన్​ పాఠాలు అర్థంకావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్​లైన్​పరీక్షలు విద్యార్లుల్లో తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కానీ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు నియంతృత్వ పోకడలతో విద్యార్థులను భయందోళనకు గురిచేస్తున్నాయి. ఫీజులు చెల్లించకపోతే క్లాస్​లింకులు పెట్టమని తెగేసి చెబుతున్నాయి.

రంగారెడ్డి జిల్లాలో తెలంగాణలోనే అత్యధికంగా కార్పొరేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. జిల్లాలోని నారా యణ, శ్రీచైతన్య, కృష్ణవేణి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, డీపీఎస్, సుజాత స్కూల్ లాంటి కార్పొరేట్ సం స్థలు విద్యార్థులను ఫీజుల కోసం పీడిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కారోనా కాలం నుంచి ఇప్పటి వరకు సరియైన ఉపాధి లేకపోవడంతో అనేక కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. హైదరాబాద్ శివారులోని మున్సిపాలిటీలు, గ్రామ పరిధిలో పుట్టగొడుగుల్లా కార్పొరేట్ విద్యాసంస్థలు వెలిశాయి. ఇవన్నీ రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ పరిధిలోకి వస్తాయి. కరోనా వైరస్ వ్యాప్తితో కార్పొరేట్ యాజమాన్యాలు ఆన్​లైన్ క్లాసుల కు తెరతీశాయి.

తప్పని తిప్పలు..

ఉపాధి కోసం నగర శివారులోకి వచ్చిన కుటుంబాలు వైరస్ విజృంభనతో సొంత ఊళ్లకు వెళ్లిపోయాయి. అయినప్పటికీ విద్యార్థుల చదువు కొనసాగిస్తున్నారు. 10, 9, 8వ తరగతి చదువుతున్న వి ద్యార్థులు ఆన్​లైన్​క్లాసులు వింటు న్నారు. ఇందుకు స్కూల్​ స్టేషనరీ, ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. స్కూల్ యాజమాన్యం పెట్టే ఒత్తిడి కి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ప్రభు త్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవే ట్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

జిల్లాలో 60వేల మంది..

రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు 1,30,000 మంది ఉన్నారు. వీరి లో కేవలం 60వేల మంది విద్యా ర్థులు మాత్రమే ఆన్​లైన్ క్లాసులకు హాజరవుతున్నట్లు సమాచారం. సగానికి పైగా విద్యార్థులు క్లాసుల కు దూరంగా ఉన్నారు. మొబైల్ అందుబాటులో ఉంటే ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఇంటర్నెట్ ఉంటే మొబైల్ లేదు. ఇంటర్నెట్‌, మొ బైల్‌ లేనివారు సు మారుగా 49 వేల మంది ఉన్నారు. మొబైల్‌ ఉ న్నా నెట్‌ లేనివారు 44వేలు, మొ బైల్స్‌ లేని విద్యార్థులు 30వేల మంది, డీటీహెచ్‌ కనెక్షన్‌ ఉన్న వి ద్యార్థు లు 15వేలు, లోకల్‌ కేబుల్‌ కనెక్ష న్‌ ఉన్న విద్యార్థులు 65వేల మం ది ఉన్నారు. టీవీ, మొబైల్‌ లేని విద్యార్థులు 6వేలకు పైగా ఉంటా రని విద్యాశాఖాధికారులు అంచ నా వేశారు. ఈ విధంగా విద్యార్థు లు ఒక్కోతీరుగా ఇబ్బంది పడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed