గ్రామున్నర… ప్రపంచాన్ని వణికిస్తోన్నది!

by Aamani |
గ్రామున్నర… ప్రపంచాన్ని వణికిస్తోన్నది!
X

దిశ, ఆదిలాబాద్: కేవలం గ్రామున్నర..! యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్నది. ఒక గ్రామున్నర ప్రపంచాన్ని వణికించడం ఏమిటి అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీని చదవాల్సిందే. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ఆస్పత్రిపాలు చేయడం మొదలుకొని అగ్రరాజ్యం అమెరికా, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా, స్పెయిన్, ఇండియా ఇలా 200 పైగా దేశాల్లో పేద, ధనిక తేడా లేకుండా మిలియనీర్లను సైతం దవాఖానా పాలు చేసి… రెండు లక్షలకు పైగా మంది ప్రాణాలను బలిగొన్న వైరస్ గుర్తుందా..! ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షలకు పైగా మంది దాని బారిన పడి చావు బతుకుల నడుమ కొట్టుమిట్టాడేలా చేస్తున్న ఆ వైరస్సే కరోనా(కొవిడ్-19).

ఆ వైరస్ బరువెంతో తెలుసా..?

కరోనా వైరస్(కొవిడ్-19) అనగా ఓ సూక్ష్మజీవి.. దీని బరువు కేవలం 0.85 ఆటోగ్రాములు మాత్రమేనని నిర్మల్ కు చెందిన ప్రముఖ పిల్లల వైద్యుడు డా. అప్పాల చక్రదరి ఈ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. కరోనా వైరస్ బరువు 0.85 ఆటొగ్రాములు అని చెప్పారు. ఈ వైరస్ మనిషి శరీరంలో చేరి క్రిములు(సూక్ష్మజీవులు)ను పునరుత్పత్తి చేస్తుంది.. అలా అది మన శరీరంలో 70 బిలియన్ల క్రిములు(సూక్ష్మజీవులు) లను పునరుత్పత్తి చేసినప్పుడే కరోనా వైరస్ లక్షణాలు బయటపడతాయని చెప్పారు. అంటే 7 వేల కోట్ల వైరస్ క్రిములు మనిషి శరీరంలో ఉన్న సమయంలో మాత్రమే కొవిడ్-19 సోకినట్లు అనుమానిస్తారు. 7 వేల కోట్ల కరోనా వైరస్ క్రిముల బరువు 0.00005 గ్రాములు. ఈ లెక్కన రెండు మిలియన్లు… అంటే 20 లక్షల మందిలో ఉన్న వైరస్ బరువు ఒక్క గ్రాము అవుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో 30 లక్షలకు పైగా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మంచం పట్టిన వారిలో ఉన్న వైరస్ తూకం ఒకటిన్నర గ్రాములు మాత్రమే. నిజంగా ఇది విచిత్రమే కదా..!

సూక్ష్మజీవుల్లోకెల్లా సూక్ష్మం: డాక్టర్ చక్రవర్తి

కరోనా వైరస్ అత్యంత సూక్ష్మమైనది. సూక్ష్మజీవుల్లో కెల్లా సూక్ష్మమైనది అని చెప్పుకోవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన వైరస్ గతంలో ఎప్పుడూ లేదు. ఇది ఒక ఎగ్ షెల్ లాంటిది. ప్రాణం లేనిదని చెబుతున్నప్పటికీ, గుడ్డుకు ప్రాణం ఉందా… అని అడిగితే వచ్చే సమాధానమే ఈ కరోనా వైరస్ కు సమాధానం అవుతుంది.

tags: Adilabad, Coronavirus, Insect, 0.85 Autograms, Covid-19, Dr. Chakradhari

Advertisement

Next Story

Most Viewed