- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేటి నుంచే దేశంలో కరోనా వ్యాక్సిన్ "డ్రైరన్"
దిశ,వెబ్ డెస్క్ : దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించేందకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. దేశంలో కోటి పైగా కరోనా సోకిన రాష్ట్రాల్లో రెండురోజుల పాటు డ్రైరన్‌ను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాంలలో డిసెంబర్ 28,29 డ్రైరన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తిచేసింది. ఈ నాలుగు రాష్ట్రాలకు చెందిన ఒక్కో జిల్లాలో రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్ తో పాటు, స్టోరేజ్ ఇలా వివిధ అంశాలను పరిశీలించనున్నారు.
వ్యాక్సినేషన్ నిర్వహణపై ట్రైనింగ్
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు సంబంధిత అధికారులు కేంద్రం ట్రైనింగ్ ఇచ్చింది. వ్యాక్సిన్ ఎలా వేయాలి. డేటా ఎలా కలెక్ట్ చేసుకోవాలి. స్టోరేజ్ తో పాటు ఇలా అన్నీఅంశాలపై మెడికల్ ఆఫీసర్లు, వ్యాక్సిన్ వేసే సిబ్బంది, వ్యాక్సిన్ స్టోర్ చేసే సిబ్బంది, సూపర్‌వైజర్లు, డేటామేనేజర్లు, ఆశావర్కర్లకు ట్రైనింగ్ ఇచ్చినట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మంత్రిత్వశాఖ తెలిపింది.
ఈ నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించే డ్రై రన్ లో కరోనా వ్యాక్సిన్ పై ట్రైనింగ్ తీసుకున్న హెల్త్‌కేర్ డిపార్ట్- మెంట్ సభ్యులు పాల్గొంటారని చెప్పింది. టీకాల సెషన్ల నిర్వహణ, మొత్తం టీకా ప్రక్రియ నిర్వహణ కోసం కో-విన్ ఐటి (COVID-19 Vaccine Intelligence Network (Co-WIN) ప్లాట్‌ఫాంను ఉపయోగించడం, హెచ్‌ఆర్ కోల్డ్ చైన్ అమలు చేయడం, ప్రతికూల సంఘటనలు జరిగితే వాటి నిర్వహణ, కమ్యూనికేషన్స్ మరియు ఇంటర్‌సెక్టోరల్ కోఆర్డినేషన్, బయోమెడికల్ వంటి శిక్షణ యొక్క అన్ని కార్యాచరణ అంశాలు ఉన్నాయి.
వ్యాక్సిన్ స్టోర్ చేసేందుకు కేంద్రాల ఏర్పాట్లు
కరోనా వ్యాక్సిన్ ను నిల్వ చేసేందుకు ఉపయోగించే 85,634 ఎక్విప్ మెంట్ ను నిల్వచేసేందుకు దేశ వ్యాప్తంగా 28,947 కోల్డ్ స్టోరేజ్ లను ఏర్పాటు చేసినట్లు యూనియన్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. అయితే ఈ కోల్డ్ స్టోరేజ్‌లో 3 కోట్లమందికి మాత్రమే వ్యాక్సిన్ అందించేందుకు సదుపాయం ఉన్నట్లు చెప్పింది.