- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వచ్చే ఏడాదిలోనే కరోనా వ్యాక్సిన్?
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ఆగస్టు15లోపు అందుబాటులోకి వస్తుందా? రాదా? అనే చర్చకు ఫుల్‌స్టాప్ పడనుంది. ఈ మహమ్మారికి టీకా వచ్చే ఏడాదిలోపు అందుబాటులోకి రాదని పార్లమెంటరీ ప్యానెల్‌కు అధికారులు వివరించారు. జైరాం రమేష్ నేతృత్వంలోని పార్టమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు సైన్స్ అండ్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ శాఖ అధికారులతోపాటు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) అధికారులు హాజరయ్యారు. కరోనా వ్యాక్సిన్ గురించిన కీలక సమాచారాన్ని కమిటీకి తెలిపినట్టు సమాచారం.
మార్చి 23న వాయిదా పడిన సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ స్టాండింగ్ కమిటీ శుక్రవారం మళ్లీ సమావేశమైంది. కరోనా వైరస్‌కు టీకా ఈ ఏడాదిలోపు అందుబాటులోకి వచ్చే అవకాశాల్లేవని అధికారులు కమిటీకి వెల్లడించారు. మనదేశంలో అభివృద్ధి చెందుతున్న కోవాక్సిన్, జైదూస్ టీకాలకు తొలి, ద్వితీయ క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోవాక్సిన్ టీకాను ఆగస్టు 15లోపు అందుబాటులోకి వస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ ఓ లేఖలో పేర్కొన్నారు. దీని సాధ్యాసాధ్యాలపై దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా, వచ్చే ఏడాదిలోపు కరోనా టీకా అందుబాటులోకి రాకపోవచ్చని అధికారులు పార్లమెంటరీ కమిటీకి వెల్లడించారు.