- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో ఎంటరైన కరోనా
ఇదిగో కరోనా, అదిగో కరోనా అంటూ భయపెట్టిన ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా వైరస్ ప్రవేశించింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ద్వారా తెలంగాణలోకి కరోనా ప్రవేశిస్తే.. ఇటలీ నుంచి వచ్చిన యువకుడి ద్వారా కరోనా నెల్లూరుకు సోకింది. 14 రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చిన కరోనా బాధితుడు జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో నాలుగు రోజుల క్రితం నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రిని సందర్శించాడు. అతని రక్తనమూనాలు పరీక్షించి అతనికి కరోనా సోకినట్టు గుర్తించారు.
దీంతో నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేటెడ్ వార్డును ఏర్పాటు చేసి, నాలుగు రోజులుగా అతనికి వైద్యచికిత్స అందిస్తున్నారు. రెండో విడత పరీక్షల నిమిత్తం అతని బ్లడ్ శాంపిల్స్ పూణే పంపించారు. కాగా, బాధితుడు నెల్లూరు చిన్నబజారు ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు. ఈ 14 రోజులు అతనితో కలిసి ఉన్న కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా బాధితుడి కుటుంబ సభ్యులతో సంబంధం ఉన్నవారు, అతనింటి పరిసరాల్లో ఉన్నవారిని అప్రమత్తం చేశారు.
కాగా, గత నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా భయంతో పలువురు ఆసుపత్రులకు చేరుకోగా, వారిని ఐసోలేటెడ్ వార్డుల్లో ఉంచి వైద్యపరీక్షలు నిర్వహించి వారెవరికీ కరోనా సోకలేదని నిర్ధారించారు. కాగా, కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యక చర్యలు చేపట్టింది. అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఐసోలేటెడ్ వార్డులు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించింది. కరోనాపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
Tags: corona, andhra pradesh, nellore district, corona virus