కరోనా.. ల్యాబ్‌లోనే పుట్టింది: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

by vinod kumar |
కరోనా.. ల్యాబ్‌లోనే పుట్టింది: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
X

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై స్పందిస్తూ.. ప్రస్తుతం నెలకొన్న గడ్డు పరిస్థితుల్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచడం అతిపెద్ద సవాల్ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ‘మనం కరోనాతో పోరాడుతున్నాం.. దానితోపాటు ఇప్పుడు ఆర్థిక యుద్ధమూ చేస్తున్నాం. మనది పేద దేశం. అందుకే, లాక్‌డౌన్‌ను నెలలపాటు కొనసాగించలేం’అని అభిప్రాయపడ్డారు. ‘కరోనా వైరస్‌తో కలిసి బతికే కళను పెంపొందించుకోవాలనే విషయాన్ని మనమంతా అర్థం చేసుకోవాలి. ఇది సహజంగా పుట్టుకొచ్చిన వైరస్ కాదు. కృత్రిమమైనది. ల్యాబ్‌లో పుట్టింది. ప్రపంచదేశాలు ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనే పనిలో తలామునకలయ్యాయి. ఈ వ్యాక్సిన్‌తోనే భయాలను పారదోలి.. సమస్యను పరిష్కరించగలం’అని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed