- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘బీజేపీని అడ్డుకునేందుకు లాక్‌డౌన్’
కోల్‌కతా: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదువుతుండగా, బీజేపీ పశ్చిమబెంగాల్ యూనిట్ చీఫ్ మాత్రం మహమ్మారి పూర్తిగా సమసిపోయిందని బహిరంగంగా డిక్లేర్ చేశారు. బీజేపీ ప్రచార ర్యాలీలను అడ్డుకోవడానికే మమతా బెనర్జీ సర్కారు లాక్‌డౌన్‌లు విధిస్తున్నదని, చుట్టుపక్కలా వైరస్ ఉన్నట్టు నమ్మిస్తున్నారని జనం భారీగా హాజరైన ఓ ర్యాలీలో ఆరోపించారు.
కానీ, తమ ప్రచారాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. చాలా మంది నేతలు ఆన్‌లైన్ ర్యాలీలు నిర్వహిస్తుండగా దిలీప్ ఘోష్ మాత్రం నేరుగా ప్రజలతో మాట్లాడారు. కరోనాను లైట్ తీసుకోవద్దని, మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోడీ ప్రకటించిన తదుపరి రోజే ఆ పార్టీకి చెందిన దిలీప్ ఘోష్ తాజా ప్రకటనలు చేయడం గమనార్హం.
మమతా బెనర్జీ సర్కారు హిందు వ్యతిరేక మైండ్‌సెట్ కలిగి ఉన్నదని, మైనార్టీలను బుజ్జగించే నిర్ణయాలు తీసుకుంటున్నదని బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా గురువారం టీఎంసీ సర్కారుపై దాడి చేసిన సంగతి తెలిసిందే.