ఒక్కరోజే 29 కేసులు

by Shamantha N |
ఒక్కరోజే 29 కేసులు
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ జడలు విప్పుతున్నది. చాపకింది నీరులా ఏర్పడకుండానే అంతటా విస్తరిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు మొత్తం 20 రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాపించింది. శుక్రవారం ఒక్కరోజే దేశంలో 29 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించిన కరోనా కేసుల సంఖ్య 223కు చేరింది. కాగా, కరోనావైరస్ కారణంగా మరో వ్యక్తి మరణించినట్టు సమాచారం. ఆ వ్యక్తి కరోనాతో మృతి చెందినట్టు నిర్దారణ అయితే.. ఈ వైరస్ మృతుల సంఖ్య ఐదుకు చేరుతుంది.

కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం.. ఇప్పుడు కరోనా యాక్టివ్‌గా ఉన్న కేసులు 196. కరోనా వైరస్ బారినపడి తిరిగి కోలుకున్నవారు 22 మంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో వెలుగుచూశాయి. ఈ రాష్ట్రంలో 52 కేసులు నమోదయ్యాయి. దీంతో ముంబయి, పూణె, నాగ్‌పూర్ సహా మరికొన్ని నగరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ చేసింది. 28 కేసులతో తర్వాతి స్థానంలో కేరళ ఉన్నది. తెలంగాణలో 17 కేసులున్నట్టు(రాష్ట్ర ప్రభుత్వం 18 కేసులు వెలుగుచూసినట్టు ప్రకటించింది) కేంద్రం వివరించింది.

Tags : coronavirus, mounting cases, 223 cases, across india, spread

Advertisement

Next Story

Most Viewed