12వేలు దాటిన కరోనా కేసులు.. 414 మరణాలు

by vinod kumar |
12వేలు దాటిన కరోనా కేసులు.. 414 మరణాలు
X

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 12 వేల మార్కును దాటింది. గురువారం ఉదయానికి మొత్తం కేసులు 12,380కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 76 మంది విదేశీయుల కేసులూ ఉన్నాయి. కాగా, ప్రస్తుతం యాక్టివ్‌గా 10,477 కేసులున్నాయి. 1,489 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 37 మంది కరోనా కారణంగా మరణించినట్టు కేంద్రం వెల్లడించింది. దీంతో కరోనా మృతుల సంఖ్య 414కు చేరింది.

మహారాష్ట్రలో మూడు వేలకు చేరువలో..

మనదేశంలో కరోనా.. మహారాష్ట్రను వణికిస్తున్నది. దేశంలో మొత్తం కేసులు 12వేలు దాటగా.. ఈ ఒక్క రాష్ట్రంలోనే సుమారు మూడు వేల కేసులు రిపోర్ట్ అయ్యాయి. అంతేకాదు, అత్యధిక మరణాలు కూడా ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో 2,916 కరోనా కేసులు నమోదవ్వగా.. 187 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, మహారాష్ట్ర మినహా మరో మూడు రాష్ట్రాల్లో కరోనా కేసులు వెయ్యిని దాటాయి. ఢిల్లీలో 1,578 కేసులు, తమిళనాడులో 1,242 కేసులు, రాజస్తాన్‌లో 1,023 వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో 987 కరోనా కేసులు నమోదయ్యాయి.

Tags: coronavirus, across, country, cases, deaths, india, health ministry

Advertisement

Next Story