- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నువ్వు లేని జీవితం నాకొద్దు నాన్న.. నీతో పాటే నేను..!
దిశ, వెబ్ డెస్క్: కరోనా.. కరోనా ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మహమ్మారి పేరే వినిపిస్తుంది. ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తుంది. ఎంతోమంది ఆత్మీయులను దూరం చేస్తుంది. ఎన్నో వ్యాపార రంగాలను కుదేలయ్యేలా చేస్తుంది. బంధాలను, బంధుత్వాలను ఒక్కసారిగా తెంచేస్తుంది. రోజురోజుకు ఈ మహమ్మారి వైరస్ వలన మరణాలు ఎక్కువవుతున్నాయి. ఎన్నో బాధాకర ఘటనలు, హృదయ విదారకమైన దృశ్యాలు చూడవల్సివస్తుంది. తాజాగా కరోనాతో తండ్రి మరణించడంతో.. ఆయన లేడన్న బాధతో కూతురు కూడా చితిలోకి దూకి ఆత్మహత్యచేసుకున్న ఘటన ఇండో పాక్ సరిహద్దుల్లో ఉన్న బార్మెర్ జిల్లా లో వెలుగు చూసింది.
ఇండో పాక్ సరిహద్దుల్లో ఉన్న బార్మెర్ జిల్లా రాయ్ కాలనీలో దామోదర్ దాస్ కోవిడ్ బారిన పడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన అతను ఇటీవల మృతిచెందాడు. కరొనతో మృతిచెందడంతో అంత్యక్రియలకు కేవలం అతని కుమార్తెలను మాత్రమే అనుమతించారు. తండ్రి మృతిని కళ్లారా చుసిన దామోదర్ దాస్ చిన్న కూతురు శారద చంద్రిక తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోయింది. గుండెలవిసేలా రోదించింది. తండ్రి లేని జీవితం తనకొద్దనుకుంది. చితిమంటలపై తండ్రి శవం కాలుతుండగా.. హఠాత్తుగా తాను కూడా చితిమంటల్లోకి దూకేసింది. ఈ హఠాత్పరిణామానికి ఖంగుతున్న అక్కడివారు వెంటనే శారదను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శారద శరీరం 70 శాతం కాలిపోయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.