కరోనా డేంజర్ బెల్స్.. 24 గంటల్లో ఐదుగురు మృతి

by GSrikanth |
కరోనా డేంజర్ బెల్స్.. 24 గంటల్లో ఐదుగురు మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో మ‌ళ్లీ క‌రోనా కేసులు క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. భారత్‌లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరోసారి అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే కేరళలో గత 24 గంటల్లో 300 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ముగ్గురు చనిపోయారని కేరళ వైద్యశాఖ తెలిపింది. మరోవైపు కర్ణాటకలో గడిచిన 24 గంటల్లో 92 కొవిడ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు చనిపోయారు. దీంతో అక్కడి ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. తదుపరి కార్యాచరణపై ఇవాళ అధికారులు సమావేశమయ్యారు. కాగా, డిసెంబర్ 21 నాటికి దేశంలో 2669 కొవిడ్ యాక్టీవ్ కేసు‌లు ఉన్నాయి.

Advertisement

Next Story