- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో 74, 281 కరోనా కేసులు
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో ఒక్కరోజులో నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య వేలల్లో నుంచి దిగిరావడం లేదు. బుధవారం దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 3,525 పాజిటివ్ కేసులతో కలిపి కేసుల సంఖ్య 74,281కి చేరింది. వీరిలో 24,386 మంది డిశ్చార్జి కాగా 2,415 మంది చనిపోయారు. ఏపీలో ఒక్కరోజే 48పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,137కు చేరింది. ఇప్పటిదాకా డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,142 ఉండగా 47మంది మరణించారు. మహారాష్ట్రలో 1,495 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 25,922కు చేరింది. ఇప్పటివరకు 5,547 మంది డిశ్చార్జి అవగా 975 మంది చనిపోయారు. ముంబైలోనే బుధవారం నాటికి మొత్తం కేసులు 15,000 దాటాయి. ఇక్కడ మొత్తం 15,747 కేసులు నమోదయ్యాయి. 596 మంది ఇప్పటివరకు కరోనాతో మరణించారు. తమిళనాడులో కరోనా కేసుల నమోదు స్పీడు ఏ మాత్రం తగ్గడం లేదు. 509 కేసులు కొత్తగా వెలుగుచూడడంతో మొత్తం కేసుల సంఖ్య 9,227కు చేరింది. 2,176 మంది డిశ్చార్జి అవగా ఇవాళ 42 మంది డిశ్చార్జి అయ్యారు. ముగ్గురు మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 64గా నమోదైంది. గుజరాత్‌లో 364 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 9,268కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 224 పాజిటివ్ కేసులు నమోదవడంతో కేసుల సంఖ్య 6,542కు చేరింది. ఇప్పటివరకు 2020 మంది వ్యాధి నుంచి కోలుకోగా 4,454 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 68 మంది మరణించారు. ఒడిశాలో ఒక్కరోజే 101 కేసులు నమోదవడం కలవరపెడుతోంది. మొత్తం కేసుల సంఖ్య 538కి చేరింది. పాజిటివ్ కేసుల్లో గంజాం జిల్లాలో 52, బాలాసోర్‌లో 33 ఉన్నాయి.