గాలి ద్వారానే కరోనా.. స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ

by Anukaran |   ( Updated:2021-05-26 04:51:47.0  )
గాలి ద్వారానే కరోనా.. స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ గాలి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా కరోనా సోకినా వ్యక్తి దగ్గర దగ్గినా, తుమ్మినా, మాట్లాడినప్పుడు వచ్చే నీటి తుంపర్లు గాలిలో వ్యాపించి ఎదుటివారికి సోకుతుందని తెలిపింది. ఈ మేరకు సవరించిన కొవిడ్‌-19 క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోటోకాల్స్‌ను బుధవారం విడుదల చేసింది. ఇక గతేడాది వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినా, తుమ్మినా, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని చెప్పినప్పటికీ.. గాలి ద్వారా వ్యాపిస్తుందన్న విషయాన్ని ఆరోగ్యశాఖ స్పష్టం చేయకపోవడంతో గాలి ద్వారా వైరస్ సోకె అవకాశం లేదని అందరు ఉపిరి పీల్చుకున్నారు. కానీ, కొత్త ప్రోటోకాల్స్ ప్రకారం ఖచ్చితంగా గాలి ద్వారా వైరస్ సోకుతుందని ఆరోగ్యశాఖ తెలిపింది.

కరోనా గాలి ద్వారా సుమారు 10 మీటర్ల వరకు ప్రయాణించే అవకాశముందని, రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వచ్చే తుంపర్లు ఎదుటివారి కళ్లలోను, నోటిలో లేదా ముక్కులోను పడినా వైరస్ సోకే ప్రమాదముందని తెలిపారు. అంతేకాకుండా గాలి, వెలుతురు లేని ప్రదేశాల్లో ఉన్నవారికి వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. ఈ నీటితుంపర్లు గాలిలో సిరంగా ఉండిపోవడం వలన వైరస్ సోకుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed