'కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా అందించాలి'

by Harish |
కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా అందించాలి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచం మొత్తం భయంకరమైన కరోనా వైరస్ బారిన పడింది. ఇలాంటి సంక్షోభ సమయంలో కరోనా లాంటి వైరస్‌కు విరుగుడుగా కనిపెట్టే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉచితంగా అందించాలని ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.

కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఉచితంగానే టీకా అందాలని ఆశిస్తున్నాను. ఈ టీకాలు ప్రపంచంలోని మొత్తం జనాభాకు ఉచితంగా అందించాలి. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థలకు పరిహారాన్ని అందించడం నయం. యూఎన్, వివిధ దేశాల వారు వ్యాక్సిన్ ఖర్చు నుంచి భారీ లాభాల కోసం చూడకపోవడం మంచిదని’ ఆయన తెలిపారు. వ్యాక్సిన్‌లను ఉచితంగా ఇచ్చేందుకు ఖర్చులను భరించగల సంస్థలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఐరాస భద్రతా మండలి సభ్యులు ఈ ఖర్చులో ప్రధాన భాగాన్ని పంచుకోవాలని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed