- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3.80లక్షల మందికి టీకా.. 580మందిలో దుష్ప్రభావాలు
న్యూఢిల్లీ: మూడు రోజుల వ్యవధిలో సుమారు 3.80లక్షల మందికి కరోనా టీకాలు వేసినట్లు సోమవారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో 580 మందిలో దుష్ప్రభావాలు వెలుగు చూశాయని, ఏడుగురిని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఇద్దరు మృతిచెందిన అందుకు కరోనా టీకా కారణం కాదని స్పష్టం చేసింది. ఆదివారం సాయంత్రం ఉత్తర్‌ప్రదేశ్ మొరదాబాద్‌లో ఓ వ్యక్తి మృతిచెందారు. వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల తర్వాత మహిపాల్ సింగ్ (46) అనే ప్రభుత్వ హాస్పిటల్ వార్డు బాయ్ మృతిచెందారు. ఆయన మృతికి, కరోనా వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని జిల్లా ప్రభుత్వ వైద్యాధికారి తెలిపారు. కార్డియో పల్మనరీ వ్యాధి కారణంగా కార్డోజెనిక్ అరెస్టు/ సెప్టిక్ షాక్ ద్వారా మహిపాల్ మృతిచెందినట్లు పోస్టుమార్టం ద్వారా స్పష్టమైందని చెప్పారు. 43ఏండ్లు కలిగిన మరో వ్యక్తి కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో మృతిచెందాడు. కార్డియో పల్మనరీ విఫలం కావడంతో మృతిచెందినట్లు ప్రభుత్వం తెలిపింది. పోస్టుమార్టం నిర్వహించామని పేర్కొంది. ఢిల్లీలోని హాస్పిటల్‌లో ముగ్గురు అడ్మిట్ కాగా ఇద్దరు డిశ్చార్జ్ చేశామని, ఒకరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు పేర్కొంది. కర్ణాటకలో ఇద్దరు ఆస్పత్రుల్లో చేరగా ఒకరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఉత్తరాఖండ్, చత్తీస్‌గఢ్‌ల్లో ఒకరు చొప్పున హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.