ఇప్పటికే ఇద్దరు మృతి.. మళ్లీ 8 మందికి కరోనా

by Anukaran |
ఇప్పటికే ఇద్దరు మృతి.. మళ్లీ 8 మందికి కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కాకవికలం చేస్తోంది. దాని కోరలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా విజయవాడలోని దుర్గా గుడిలో 8 మందికి కరోనా సోకింది. దీంతో దుర్గా గుడి సిబ్బంది, పండితులు, అధికారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా గుడి మొత్తాన్ని శానిటైజ్ చేశారు. కాగా, ఇప్పటికే కరోనా సోకి దుర్గా గుడికి చెందిన ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story