ఆస్ట్రేలియా క్రికెటర్లకు కరోనా టెస్టులు

by Shyam |   ( Updated:2020-11-17 00:00:56.0  )
ఆస్ట్రేలియా క్రికెటర్లకు కరోనా టెస్టులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ముగించుకున్న టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసిరింది. మొదటి టెస్టు మ్యాచ్ జరుగబోతున్న ఆడిలైడ్‌లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఆసీస్ క్రికెటర్లందరూ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ సహా ఐదుగురు క్రికెటర్లు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా మంగళవారం ఆసీస్ క్రికెటర్లకు మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు పరీక్షలు నిర్వహించనున్నట్టు సంబంధిత బోర్డు సభ్యులు వెల్లడించారు. అంతేగాకుండా ఆడిలైడ్‌లో జరుగబోయే మొదటి టెస్టు మ్యాచ్ యథాతథంగా జరుగుతుంది అని ఆసీస్ బోర్డు స్పష్టం చేసింది.

Advertisement

Next Story